Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

ఇస్రోలో 220 టెక్నీషియన్ పోస్టులు

ఇస్రోకు చెందిన బెంగళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ 2026-27 ఏడాదికి గానూ గ్రాడ్యుయేట్ (220), టెక్నీషియన్ (120), కమర్షియల్ ప్రాక్టిస్ (70) విభాగాల్లో మొత్తం 410 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి వివిధ ఇంజినీరింగ్, కమర్షియల్ ప్రాక్టీస్ విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. 2022 నుంచి 2026 మధ్య అర్హత సాధించిన వారే దరఖాస్తు చేసుకోవడానిక అర్హులు. ఎంపికైన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు రూ. 12,300, టెక్నీషియన్ అప్రెంటిస్ లకు రూ. 10,900 స్టైపెండ్ చెల్లిస్తారు.
విద్యార్హతల మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఎన్ ఏటీఎస్ పోర్టల్ లో నమోదు చేసుకుని, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉమాంగ్ పోర్టల్ లోని అప్రుంటిషిప్ ద్వారా తమ సర్టిఫికెట్, ఫోటో, సంతకం అప్ లోడ్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఆగస్టు 28, 2026 చివరి తేదీ.
వెబ్ సైట్: https://www.isro.gov.in