Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

క్యాట్ 2026 నోటిఫికేషన్

కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CAT 2026) నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (IIMs) ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా దేశంలోని వివిధ ఐఐఎంల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ (PGP/MBA)తోపాటు ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్ మెంట్ (FPM/PHD) వంటి మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ లలో క్యాట్ స్కోర్ తో ప్రవేశాలు కల్పిస్తారు. క్యాట్ 2026 పరీక్షను 2026, నవంబర్ 29న మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉంటాయి. దేశంలోని 21 ఐఐఎమ్ లతో పాటు ఎఫ్ఎమ్ఎస్ ఢిల్లీ, ఎస్ పిజేఐఎమ్ ఆర్, ఎమ్ డిఐ గుర్గావ్, ఐఐటీలు, ఐఐఎఫ్ టీ వంటి అగ్రశ్రేణి బి స్కూళ్లలో క్యాట్ పరీక్ష స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రోగ్రామ్ డిటెయిల్స్:
క్యాట్ 2026 – ఐఐఎంల్లో ఎంబీఏ/పీజీపీ, పీహెచ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు
కోర్సులు ఇవే: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్ మెంట్ (PGP/MBA)
ఫెలో /డాక్టరేట్ ప్రోగ్రామ్ లు (FPM/Ph.D), ఎగ్జిక్యూటివ్ పీహెచ్ డీ ప్రోగ్రామ్
ఇతర మేనేజ్ మెంట్ కోర్సులు
అర్హతలు:
అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/విద్యా సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు లేద అంతకు సమానమైన సీజీపీఏ సాధించాలి. ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. చివరి ఏడాది బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న వారు లేదా డిగ్రీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఏ/సీఎస్/ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) వంటి ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్ములే.
దరఖాస్తు: ఆన్ లైన్ లో చేయాలి.
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీకు రూ. 1350, ఇతర పోస్టులకు రూ. 2,700
రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీ: 15.09.2026
అడ్మిట్ కార్డులు: 4.11.2026 నుంచి 29.11.2026 వరకు
క్యాట్ 2026 పరీక్ష తేదీ: 29.11. 2026
ఫలితాలు: జనవరి 2027
పరీక్షా కేంద్రాలు: దేశంలోని 170 నగరాల్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు తమకు నచ్చిన 5 నగరాలను ఎంపిక చేసుకోవచ్చు.
వెబ్ సైట్: https://iimcat.ac.in