Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ లతో పాటు పలు జాతీయ వైద్య సంస్థల్లో సేవలందించేందుకు 2218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం విద్యార్హతలతో ఈ నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్ మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్టు (NORCET) ద్వారా నిర్వహిస్తారు. మొత్తం పోస్టుల్లో 80 శాతం మహిళలకే దక్కునున్నాయి. మిగిలిని 20 శాతం పోస్టులు పురుషులకు అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోనూ విజయం సాధించిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనంతరం పోస్టులు కేటాయిస్తారు.

మొత్తం పోస్టులు: 2218
అర్హత: బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎంతో పాటు కనీసం 50 పడకల అసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు గడువు తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లులోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మేడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి 15 ఏళ్లు సడలింపు ఉంటుంది.
పరీక్షా విధానం:
ప్రిలిమ్స్:
ప్రశ్నాపత్రంలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
దీనిలో 80 ప్రశ్నలు సబ్జెక్టు నుంచి మిగతావి 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి అడుగుతారు.
నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి.
ప్రతి తప్పు సమాధానానికి మార్కులో మూడో వంతు తగ్గిస్తారు.
పరీక్ష సమయం: 90 నిమిషాలు
మొత్తం 5 సెక్షన్లలో ఒక్కో సెక్షన్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.
ప్రతీ సెక్షనూ 18 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అర్హత మార్కులు:
జనరల్, ఈడబ్ల్యూఎస్ లకు 50 శాతం, ఓబీసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు పొందాలి. దివ్యాంగులకు అదనంగామరో 5 శాతం సడలింపు ఇస్తారు.
మెయిన్స్ పరీక్ష:
ప్రలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ లో అవకాశం కల్పిస్తారు.
ఈ జాబితా నుంచి కేటగిరీల వారీగా 5 రెట్లు మందిని మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. ఇందులో 160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు.
సమయం: 3 గంటలు ఉంటుంది.
4 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ లో 40 ప్రశ్నలు ఇస్తారు.
సెక్షన్ల వారీగా 45 నిమిషాలు సమయం ఉంటుంది.
అర్హత మార్కులు: జనరల్, ఈ డబ్ల్యూఎస్ లు 50 శాతం, ఓబీసీలు 45, ఎస్సీ ఎస్టీలు 40 శాతం మార్కులు ఉండాలి. దివ్యాంగుల కేటగిరీ వారికి అదనంగా 5 శాతం సడలింపు ఉంటుంది.
వేతనం: ఎంపికైన మొదటి నెల నుంచే రూ. 85000 ఉంటుంది.
దరఖాస్తు: ఆగస్టు 13 సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్వ్యూఎస్ కు రూ. 2400 ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు ఉండదు.
పరీక్ష తేదీలు:
ప్రిలిమ్స్ స్టేజ్ – 1 పరీక్ష: సెప్టెంబర్ 12.
మెయిన్స్ స్టేజ్ శ్ర-2 పరీక్ష: సెప్టెంబర్ 30
వెబ్ సైట్: https://aiimsexams.ac.in/