రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,993 జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 14న ప్రారంభమై, సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ 15 వరకు సమయం ఇచ్చారు. సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి (Correction Window) సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 25 వరకు అవకాశం ఉంటుంది.
అర్హతలు: సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: సాధారణ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ₹500గా నిర్ణయించారు. మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1)కు హాజరైన అభ్యర్థులకు బ్యాంక్ ఛార్జీలు మినహాయించి ₹400 వారి ఖాతాల్లోకి రీఫండ్ చేస్తారు. SC, ST, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ₹250.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది.
మొదటి దశ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-I)
రెండో దశ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-II)
ధ్రువపత్రాల పరిశీలన (Document Verification)
వైద్య పరీక్షలు (Medical Examination)
గమనిక: మొదటి దశ సీబీటీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన నార్మలైజ్డ్ మార్కుల ప్రాతిపదికన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను రెండో దశ (CBT-II) పరీక్షకు ఎంపిక చేస్తారు.
వెబ్ సైట్: https://www.rrbapply.gov.in















