గ్రాడ్యుయేట్, టెక్నికల్, కమర్షియల్ అప్రెంటిస్ పోస్టులకు ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇస్రో 410 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో ఆగస్టు 28 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 220
టెక్నికల్ అప్రెంటిస్- 120
కమర్షియల్ అప్రెంటిస్- 70
అర్హతలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్‌లు సంబంధిత విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ , కమర్షియల్ అప్రెంటిస్‌లు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2022, 23, 24, 25, 26 సంవత్సరాల్లో అర్హతకు సంబంధించిన విద్యను పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు:
అర్హులైన అభ్యర్థులు ముందుగా NATS (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) పోర్టల్‌లో నమోదు చేసుకొని..ఉమంగ్ (UMANG) పోర్టల్‌లో యూఆర్ఎస్సీ అప్రెంటిస్‌షిప్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో NATSలో వచ్చిన ఎన్రోల్మెంట్/అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం, ఇతర పత్రాలను అప్లోడ్ చేయాలి.
ఎంపిక:
విద్యార్హతకు సంబంధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
స్టైపెండ్: ఎంపికైనవారికి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ. 10,900, కమర్షియల్ అప్రెంటిస్‌లకు రూ. 10,900 స్టైపెండ్ అందిస్తారు.
చివరితేదీ: ఆగస్టు 28, 2026
వెబ్సైట్: https://nats. education.gov.in















