సింగరేణి కాలరీస్ కంపెనీలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తిచేసిన వారికి 300 అప్రెంటిస్ అవకాశాలు అందుబాటులోకి ఉన్నాయి. మొత్తం 300 సీట్లలో ఇంజినీరింగ్ విభాగానికి 150, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 100, డిప్లొమా అభ్యర్థులకు 50 సీట్లు కేటాయించారు. ఇంజినీరింగ్ విభాగంలో మైనింగ్‌కు 40, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌కు 35, మెకానికల్‌కు 35, సివిల్‌కు 15, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కు 10, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌కు 10, ఐటీకి 5 సీట్లు ఉన్నాయి. నాన్ ఇంజినీరింగ్ విభాగంలో బీఏకు 25, బీఎస్సీకి 30, బీకామ్‌కు 25, బీబీఏకు 5, బీసీఏకు 5, బీ ఫార్మసీకి 6 సీట్లు కేటాయించారు. డిప్లొమా విభాగంలో మైనింగ్‌కు 20, ఈఈఈకి 10, మెకానికల్‌కు 10, సివిల్‌కు 10 సీట్లు ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
ఇంజినీరింగ్ -150
నాన్ ఇంజినీరింగ్ -100
డిప్లొమా -50
స్టైపెండ్: ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు నెలకు రూ.12,300, డిప్లొమా అభ్యర్థులకు రూ.10,900 స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేదీ: ధ్రువపత్రాలతో ఈ నెల 16 సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వెబ్ సైట్: https://scclmines.com/apprenticeship/















