బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనంది.
పోస్టుల వివరాలు:
చీఫ్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్ పోస్టుల్లో నియామకాలు చేపట్టనుంది.
డిజిటల్ బ్యాంకింగ్-19
ఫెసిలిటీ మేనేజ్మెంట్- 88
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ-16
సెక్యూరిటీ- 54
ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్-14
కార్పొరేట్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ ప్లానింగ్-15
అర్హతలు
పోస్టులను అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ లేదా సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి 23 నుంచి 43 ఏండ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: ఆన్లైన్ పరీక్ష, సెకోమెట్రిక్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. కొన్ని పోస్టులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఎంపికైనవారికి దేశంలోని ఏ బీవోబీ బ్యాంకులోనైనా ఉద్యోగం కల్పిస్తారు.
గమనిక: పోస్టును బట్టి పని అనుభవం 2 నుంచి 10 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూసీ, ఓబీసీలకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్లకు రూ. 175.
వేతనం: ఎంపికైనవారికి పోస్టును బట్టి రూ. 48,480, రూ. 64,820, రూ. 85,920, రూ. 1,02,300 జీతం ఉంటుంది.
చివరితేదీ: ఆగస్టు 26, 2026
వెబ్సైట్: www.bankofbaroda.in















