Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

యూనియన్ బ్యాంకులో 1865 అప్రెంటిస్ పోస్టులు

దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో అప్రెంటిషిప్ ఖాళీల భర్తీకి మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్ ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  ఈ నోటిఫికేషన్ ఏడాది కాలనికి 1,865 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 164, ఏపీలో 303 ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు: 

  • అప్రెంటిస్ షిప్ ఖాళీలు: 1865
  • తెలంగాణ ఖాళీలు: 164 
  • ఏపీ ఖాళీలు: 303 

    రిజర్వేషన్ల వారీగా.. 
  • అన్ రిజర్వ్ డ్ -863
  • ఎస్సీ – 289
  • ఎస్టీ – 131 
  • ఓబీసీ -447 
  • ఈడబ్ల్యూఎస్ – 175 

అర్హత: అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఏప్రిల్ 1, 2026 నాటికి డిగ్రీ పూర్తి అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే రాష్ర్ట స్థానిక భాషలో మాట్లాడటం, రాయడం, చదవడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. 

ట్రైనింగ్: ఒక సంవత్సరం 

స్టైపెండ్: బ్రాంచ్ ఉన్న ప్రాంతాన్ని బట్టి నెలకు స్టైపెండ్ ఇస్తారు. 

  • రూరల్ లేదా సెమీ అర్బన్ లో స్టైపెండ్: రూ. 15000 
  • అర్బన్ లో స్టైపెండ్ రూ. 18000
  • మెట్రోసిటీలో స్టైపెండ్ రూ. 20,000 అందిస్తారు. 

వయసు: ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: ఆన్ లైన్ పరీక్ష జనరల్ అవేర్ నెస్, ఇంగ్లిష్, క్వాంటటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంశాలపై ఉంటుంది. 

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు 

స్థానిక భాషా పరీక్ష: ఆన్ లైన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి స్థానిక భాషా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. 

పరీక్షా విధానం: ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు.

  • జనరల్ ఇంగ్లిష్ (20 ప్రశ్నలు, 20 మార్కులు)
  • క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (20 ప్రశ్నలు, 20 మార్కులు) 
  • కంప్యూటర్ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ (20 ప్రశ్నలు, 20 మార్కులు) 
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ (20 ప్రశ్నలు, 20 మార్కులు) 

దరఖాస్తు ఫీజు: 

  • జనరల్, ఓబీసీ పురుషులకు రూ. 944
  • జనరల్, ఓబీసీ మహిళలకు రూ. 708 
  • ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ. 236 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తులు : ఏప్రిల్ 29, 2026 నుంచి మొదలు

చివరితేదీ: మే 19, 2026 

ఆన్ లైన్ పరీక్ష తేదీ: మే లేదా జూన్ 2026 (టెంపరరీ) 

వెబ్ సైట్: https://www.unionbankofindia.co.in