Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ బీఏ, బీకాం, బీఎస్సీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్, ఓపెన్ ఇంటర్, 10+2 పూర్తయిన వారు, రెండేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటీఐ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. డిగ్రీ ప్రవేశాల కోసం ఆధార్ కార్డు, SSC, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం (సంబంధిత కులం వారికి), పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో సమీప ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలి. ప్రవేశాలకు ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు www.braouonline.in వెబ్‌సైట్‌లో ప్రవేశ నమోదు పూర్తి చేసి, తాము ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రంలో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలి.
వెబ్‌సైట్‌: www.braouonline.in