Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

తెలంగాణ సెట్- 2026 షెడ్యూల్ విడుదల

టీజీసెట్ 2026 షెడ్యూల్ ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సెప్టెంబర్ చివరి వారంలో జరగనుంది. రాష్ర్టంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ నియామకాలకు అర్హత సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీజీసెట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
పరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. సమయం మూడు గంటలు.
మొదటి పేపర్ లో 50 ప్రశ్నలు 100 మార్కులుంటాయి.
రెండో పేపర్ 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు: ఆగస్టు 3 నుంచి 30 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైన్ తో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 13 నుంచి ఆన్ లైన్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అర్హత: సంబంధిత సబ్జెటక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ ఆఖరు ఏడాది చదువుతున్న వారు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 3, 2026
చివరితేదీ: ఆగస్టు 30, 2026
హాల్ టికెట్ డౌన్ లోడ్ ప్రారంభం: సెప్టెంబర్ 22, 2026
పరీక్ష తేదీ: సెప్టెంబర్ చివరి వారంలో పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్ సైట్: https://telanganaset.org/