స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) Selection Post Phase-XIV (14) 2026 నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 13, 2026న విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో Group B (నాన్-గెజెటెడ్) & Group C పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా 3003 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన వివరాలు:
- మొత్తం పోస్టులు: 3003
- దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 13, 2026
- చివరి తేదీ: మే 4, 2026
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- పరీక్ష తేదీలు: జూన్ నెలలో జరుపుతారు. 2026 (అంచనా)
- వయోపరిమితి: సాధారణంగా 18-42 సంవత్సరాలు (పోస్టును బట్టి నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా మారుతుంది)
- అర్హత :
- 10వ తరగతి (Matriculation) పోస్టులను అనుసరించి
- 12వ తరగతి (Higher Secondary) పోస్టులను బట్టి అనుసరించి
- డిగ్రీ (Graduation): పోస్టులను బట్టి
- పరీక్షా విధానం :
- పరీక్ష: కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- ప్రశ్నలు: 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు
- మార్కులు: 200 మార్కులు (ప్రతి ప్రశ్నకు 2 మార్కులు)
- సమయం: 60 నిమిషాలు
- నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు తగ్గించబడతాయి
- పరీక్షా విధానం:
- జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు)
- జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు)
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు)
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు)
- దరఖాస్తు రుసుము:
- జనరల్/OBC: రూ. 100
- మహిళా అభ్యర్థులు, SC, ST, దివ్యాంగులు (PwD), మరియు మాజీ సైనికులకు రుసుము లేదు.
- అభ్యర్థులు SSC కొత్త వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
- వెబ్ సైట్: https://ssc.gov.in/















