దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 13 వరకు కొనసాగుతుంది.
వేతనం: నెలకు రూ. 35,400
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: స్టేజ్ -1, స్టేజ్ -2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు, సర్టిఫికెట్ ల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.















