Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 ఆఫీసర్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్(LBO) పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం పొందుతారు. తగిన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 7వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు :

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer) – 2,482 పోస్టులు

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:
ఆంధ్రప్రదేశ్​ – 80 పోస్టులు
తెలంగాణ – 50 పోస్టులు

అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్ చేసి ఉండాలి. షెడ్యూల్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో కనీసం ఒక ఏడాది పోస్ట్‌-క్వాలిఫికేషన్‌ అనుభవం ఉండాలి. అభ్యర్థి అప్లై చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. అలాగే, అర్థం చేసుకోగలగాలి.

వయోపరిమితి :
అభ్యర్థుల వయసు ఆగస్టు 01, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గరిష్ఠంగా 15 ఏళ్లు వయోసడలింపు వర్తిస్తుంది

దరఖాస్తు :
తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్​సైట్​లో ఆన్​లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు చేయాలనుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 చెల్లించాల్సి ఉంటుంది.
అదే, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్థులకు రూ175గా నిర్ణయించారు.

ఎంపిక విధానం :
అప్లై చేసిన అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్​ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (GD)/ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా సిద్ధం చేస్తారు.

ఆన్‌లైన్ పరీక్ష విధానం :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) 120 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. అంటే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు.
ఇందులో 30 ప్రశ్నలు ఇంగ్లీష్ నుంచి, 30 ప్రశ్నలు బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ /ఎకానామిక్‌ అవేర్‌నెస్ నుంచి 30 క్వశ్చన్స్, రీజనింగ్ & క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 30 నుంచి ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష వ్యవధి వచ్చేసి 120 నిమిషాలు ఉంటుంది. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :
ఆన్​లైన్ దరఖాస్తు ప్రారంభం : ఆగస్టు 18, 2026.
దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 07, 2026.

వెబ్ సైట్: https://bankofbaroda.bank.in