Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

IBPS.. 11,403 బ్యాంక్ క్లర్క్‌ ఉద్యోగాలు

బ్యాంకింగ్‌ రంగంలో వేల క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశంలోని 11 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఖాళీలను 2027-28 సంవత్సరానికి భర్తీ చేస్తారు. దీనిలో తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
వయసు: ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలి ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరు ఆయా ప్రాంతపు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. దీంతో పాటు కంప్యూర్‌ పరిజ్ఞానం ఉండాలి.
ఫీజు:
జనరల్‌ అభ్యర్థులకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 175.
ఎంపిక
కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌, క్లరికల్‌ కేడర్‌ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్‌, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివితేదీ: ఆగస్టు 21, 2026.
వివరాలకు వెబ్‌సైట్‌: www.ibps.in