Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

సిద్దిపేట జిల్లాలో అంగన్ వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు

సిద్ధిపేట జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 5 ఐసీడీఎస్ చేర్యాల్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్ధిపేట్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 91 అంగన్వాడి టీచర్, ఆయాలు పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సిద్ధిపేట జిల్లా పోస్టుల వివరాలు:
చేర్యాల్ : టీచర్ -4, హెల్పర్ -1
దుబ్బాక: టీచర్ -6, హెల్పర్ -1
గజ్వేల్: టీచర్ -36, హెల్పర్ – 1
హుస్నాబాద్: టీచర్ -19, హెల్పర్ -10
సిద్దిపేట : టీచర్ -13, హెల్పర్ -0
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, తదుపరి అర్హతగా పదోతరగతి పాసై ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులు అర్హులు. దివ్యాంగులు వినికిడి పరికరాలు వినియోగించి వినగలిగే వారు, ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించే గలిగే సామర్థ్యం కలిగిన అంధులు, అంగవైకల్యంగల ప్రాథమిక విద్యా బోదన, పిల్లలను సంరక్షించగల మహిళా అభ్యర్థులు అర్హులు.
ఎంపిక ప్రక్రియ: అంగన్ వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి పది మార్కులు ఉంటాయి. ఎంపికలో మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్ లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
అభ్యర్థులు సంబంధిత తహసిల్దార్ చేత ధ్రువీకరించిన నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరి జత చేయాలి. నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ఏడాదిలోగా తీసుకున్న నివాస ధ్రువీకరణ పత్రం మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. పోస్టుల వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ (వర్గం లేదా కులానికి) చెందన వారు మాత్రమే అర్హులు.
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అప్ లోడ్ చేయవలసిన పత్రాలు..
పుట్టిన తేదీ లేదా వయసు ద్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
విద్యార్హత ధ్రువీకరణ (ఇంటర్ లేదా ఆపై విద్యార్హత మార్కుల జాబితా)
నివాస ధ్రువీకరణ పత్రం
అంగవైకల్యం ఉన్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు
వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
అనాధ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం.

దరఖాస్తు చేసిన అభ్యర్థులు అంగన్ వాడీ కేంద్రానికి చెందిన సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 1 వరకు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలనకు సమర్పించవలసి ఉంటుంది. సంబంధిత సర్టిఫెకెట్ కాపీలు రెండు జతలు జతపరిచి ఐసీడీఎస్ కార్యాలయంలో అందించాలి.
చివరితేదీ: ఆగస్టు 22, 2026
వెబ్ సైట్: https://mis.tgwdcw.in/