ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ లో భారీ గా ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం 10,743 పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ అనుమతులు ఇచ్చింది. దీనిపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నియామకాలను ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) చేపట్టనుంది. దీనికి అర్హత కలిగిన భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులలో 3,823 ఫైర్ ఆపరేటర్, 3,546 ఎమర్జెన్సీ రెస్క్యూ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1,153తో పాటు ఇతర విభాగాల ఖాళీలు నింపనున్నారు.















