ఇండియన్ రైల్వే నుంచి త్వరలో 4,098 పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా రైల్వేలోని అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ప్రకటన ద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ చేయనుంది. ఆర్ఆర్ బీ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ విడుదల చేసిన సంక్షిప్త ప్రకటన ఆధారంగా ఈ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేజ్ -1, స్టేజ్ -2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.















