ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనకు 6,534 అకడమిక ఇన్ స్ట్రక్టర్ల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. దీనిలో 3,597 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 2937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన ఎస్ జీటీలకు నెలకు 10000, స్కూల్ అసిస్టెంట్లకు రూ. 12500 చొప్పున వేతనం ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తులను సంబంధిత విద్యాశాఖాధికారులకు (MEO) అందించాలి. మెరిట్ ఆధారంగా ఎంపికైన వారిక ప్రస్తుత విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు పాఠశాలల్లో సేవలు అందించాలి.















