ఇంజనీరింగ్ చేసిన యువతి యువకులకు ఇండియన్ ఆర్మీ అద్భతమైన అవకాశం కల్పించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం బీటెక్ మార్కుల ఆధారంగా షార్ట్ స్వరీస్ కమిషన్ ద్వారా లెఫ్టినెంట్ హోదా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి, 200 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.
బీటెక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు అక్టోబర్ నుంచి డిసెంబర్ 2026 మధ్య ఐదు రోజుల పాటు సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్ బీ) ఇంటర్వ్యూల, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 2027 ఏప్రిల్ నుంచి గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
వేతనం: ట్రైనింగ్ లో నెలకు రూ. 56,100 స్టైపెండ్ ఉంటుంది. ట్రైనింగ్ ముగిశాక లెఫ్టినెంట్ హోదాలో నియమితులవుతారు. బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, మిలిటరీ సర్వీస్ పే వంటి అలెన్సులన్నీ కలిపి నెలకు రూ. 1.5 లక్షల వేతనం లభిస్తుంది.
సర్వీస్: ప్రారంభంలో 10 ఏళ్ల సర్వీస్ (4 ఏళ్ల పొడిగింపుకు అవకాశం ఉంటుంది) ఈ ఉద్యోగాల్లో ప్రలిభ ఆధారంగా శాశ్వత కమిషన్ పొందే వీలుంటుంది.
చివరితేదీ: ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 7..మధ్యాహ్నం 3 గంటల లోపు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్ సైట్: https://joinindianarmy.nic.in















