Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

Ssc Chsl 2536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CHSL)-2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 2536 ఖాళీలను భర్తీ చేయనుంది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ట్రిబ్యునళ్లు, ఇతర వాటిలో నింపనున్నారు. ఇంటర్‌ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 7 వరకు కొనసాగుతుంది.

పోస్టులు
లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (LDC)/(JSA)
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (DEO)
గ్రేడ్‌ ‘ఎ’ డేటా ఎంట్రీ ఆపరేటర్‌
మొత్తం 2536 పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హతలు
మినిస్ట్రీ ఆఫ్‌ కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రబ్యూషన్‌, SSC, మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌లోని డీఈవో/డీఈవో గ్రేడ్‌ ‘ఎ’ పోస్టులకు మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా సైన్స్‌ విభాగంలో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు కావాలి. మిగతా డిపార్ట్‌మెంట్‌, మినిస్ట్రీల్లోని ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, డీఈవో/డీఈవో గ్రేడ్‌ ‘ఎ’ పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.

వయసు
ఈ ఏడాది అక్టోబర్‌ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. 1999, ఆగస్టు 2 నుంచి 2008, ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:
రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.

ఎంపిక
టైర్‌-1, టైర్‌-2 కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ల ద్వారా ఎంపిక చేస్తారు.
టైర్‌-1 ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల కోత విధిస్తారు.
టైర్‌-2 రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్‌లో సెక్షన్‌-1 (మ్యాథమెటిక్స్‌, రీజనింగ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 30 ప్రశ్నల చొప్పున 60 ప్రశ్నలు, 180 మార్కులు), సెక్షన్‌-2 (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 40, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 60 ప్రశ్నలు,180 మార్కులు), సెక్షన్‌-3 (కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ 15 ప్రశ్నలు, 45 మార్కులు) ఉంటాయి. రెండో సెషన్‌లో సెక్షన్‌-4 (పార్ట్‌-ఎ డీఈవో డిపార్ట్‌మెంట్స్‌ స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌, పార్ట్‌-బి ఇతర డీఈవో డిపార్ట్‌మెంట్స్‌, పార్ట్‌-సి LDC/JSAలకు టైపింగ్‌ టెస్ట్‌) ఉంటుంది. సెక్షన్‌-1, 2, 3లో నెగెటివ్‌ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

జీతం
ఎంపికైనవారికి ఎల్‌డీసీ/జేఎస్‌ఏ (లెవల్‌-2)లకు రూ. 19,900 నుంచి రూ. 63,200, డీఈవో (లెవల్‌-4)లకు రూ. 25,500 నుంచి రూ. 81,100, డీఈవో (లెవల్‌-5)లకు రూ. 29,200 నుంచిరూ. 92,300, డీఈవో గ్రేడ్‌-ఎ (లెవల్‌-4)లకు రూ. 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది.క్యాలెండర్‌లు ఎంచుకోండి

చివరితేదీ
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ అక్టోబర్‌ 7.

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/