దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1250 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27 నుంచి ప్రారంభ నవంబర్ 25తో ముగుస్తుంది.
పోస్టు వివరాలు: స్టేషన్ మాస్టర్
ఈ పోస్టులను అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పుర్, చండీఘర్, చెన్నై, గోరఖ్‌పుర్, జమ్మూ-శ్రీనగర్, కోల్‌కతా, మాల్డా, ముంబై, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురంలలో నింపుతారు. ఖాళీల వివరాలు తర్వాత ప్రకటించనున్నారు.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు
2027, జనవరి 1 నాటికి కనీస వయసు 20 ఏండ్లు, గరిష్ఠ వయసు 30 ఏండ్లు ఉండాలి. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
CBT 100 మార్కులకు ఉంటుంది. 120 నిమిషాలు సమయం ఉంటుంది.
బేసిక్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ అనలిటికల్ క్యాపబిలిటీ (60)
లాజికల్ క్యాపబిలిటీ (రీడింగ్ కాంప్రహెన్షన్) 20
మెంటల్ రీజనింగ్ 20
CBTలో మెరిట్ ఆధారంగా CBATకి పిలుస్తారు. ఇది సంబంధిత RRBలోని ప్రతి ఖాళీకి సుమారు 8 మందిని ఎంపిక చేస్తారు.
మెడికల్ స్టాండర్డ్‌లో దూరం చూపు 6/9, దగ్గరి చూపు Sn- 0.6 ఉండాలి.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు రూ. 250.
జీతం
ఎంపికైనవారికి జీతం నెలకు రూ. 35,400 (పే లెవల్ 6)
చివరితేదీ
నవంబర్ 25
వెబ్సైట్ https://rrb.indianrailways.gov.in















