Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

సీఏపీఎఫ్‌లో 1871 ఎస్‌ఐ పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) 1871 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (SI) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఖాళీలను ఢిల్లీ, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (CAPF ‌) అయిన బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో నింపనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతుంది. సెప్టెంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు
CAPF (బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ)లో ఎస్‌ఐ (GD)-1320
ఢిల్లీ పోలీస్‌ విభాగంలో ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్‌) – పురుషులు- 205
ఢిల్లీ పోలీస్‌ విభాగంలో ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్‌) – మహిళలు- 112
సీఏపీఎఫ్‌ ఎస్‌ఐ (ఫైర్‌) – పురుషులు- 234

అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు శారీరక ప్రమాణాలు ఉండాలి. CISFలో ఎస్‌ఐ (ఫైర్‌) పోస్టులకు సైన్స్‌ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌) డిగ్రీ లేదా సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉండాలి. ఢిల్లీ పోలీస్‌ ఎస్‌ఐ (పురుషులు) పోస్టులకు ఫిజికల్‌ టెస్ట్‌ సమయానికి LMV (మోటార్‌ సైకిల్‌, కారు) లైసెన్స్‌ ఉండాలి.

వయసు
ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి CAPF ఎస్‌ఐ (ఢిల్లీ పోలీస్‌)కు 20 నుంచి 25 ఏండ్ల మధ్య,
CAPF (ఫైర్‌)కు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5
ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది. మహిళలకు వైవాహిక స్థితి, కేటగిరీలను
బట్టి 35 నుంచి 40 ఏండ్లలోపు ఉండాలి.

ఫీజు
రూ. 100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు, భీమ్‌, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

ఎంపిక
పేపర్‌-1, పేపర్‌-2 (కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST), ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ (PET), డిటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామ్‌ (DME), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం
పేపర్‌-1 జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌లను 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. సమయం 60 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
పేపర్‌-2 జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 20, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 20, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 20, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 100 ప్రశ్నల చొప్పున మొత్తం 160 ప్రశ్నలు, మార్కులు 320 , సమయం 2 గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.

వేతనం
ఎంపికైనవారికి జీతం రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు ఉంటుంది.

చివరితేదీ
సెప్టెంబర్‌ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌
https://ssc.gov.in