Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

హైదరాబాద్‌ ఎన్‌ఎఫ్‌సీలో 538 ఖాళీలు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ (NFC) 432 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 16 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్‌ 432 ఖాళీలను ఫిట్టర్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, కెమికల్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌, మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ (COPA), కార్పెంటర్‌, ప్లంబర్‌, వెల్డర్‌ తదితర విభాగాల్లో నింపుతారు.

పోస్టుల వివరాలు:
ఐటీఐ ట్రేడ్ – 432
డిప్లొమా ఇంజనీరింగ్ – 79
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ – 27

అర్హతలు: సంబంధిత ట్రేడులు , ఇంజనీరింగ్ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి.
అప్రెంటిస్ ఖాళీలకు పదో తరగతితో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి.

ఎంపిక:
రాత పరీక్ష ఉండదు. నిర్దేశించిన ఎంపిక ప్రక్రియ ఆధారంగా ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ లేదా మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది ట్రైనింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు: www.apprenticeshipindia.gov.in పోర్టల్‌ ద్వారా చేసుకోవాలి. అవసరమైన సర్టిఫికెట్‌లను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

చివరితేదీ: సెప్టెంబర్‌ 16.

ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: www.nfc.gov.in చూడండి.