Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌లో 376 పోస్టులు


భారత ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ (NIC) 376 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులను గేట్‌ స్కోర్‌ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
సైంటిఫిక్‌/టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఎ 376
వీటిలో కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 300
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ 26
డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ 50

అర్హతలు:
సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు 2024, 25, 26లకు సంబంధించిన గేట్‌ (GATE) స్కోర్‌ కార్డ్‌ కలిగి ఉండాలి.

వయసు:
అన్‌రిజర్వ్‌డ్‌, ఈడబ్ల్యూఎస్‌లకు 30, ఓబీసీలకు 33, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు, దివ్యాంగులకు 40 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:
రూ. 800. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు.

ఎంపిక:
స్టడీ సర్టిఫికెట్స్‌, గేట్‌ స్కోర్‌ కార్డ్‌, ఇతర డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం:
ఎంపికయినవారికి నెలకు రూ. 35,400 – 1,12,400 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభమై సెప్టెంబర్‌ 30తో ముగుస్తుంది.


చివరితేదీ: సెప్టెంబర్ 30

వెబ్‌సైట్‌: https://recruitment.nic.in