Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 545 ఆఫీసర్ ఖాళీలు

ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ) దేశ వ్యాప్తంగా 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో పాటు ఒక ఏడాది బ్యాంకింగ్ లో అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 545
తెలంగాణా – 41, ఆంధ్రప్రదేశ్ -4

వయసు: 20 నుంచి 30 ఏళ్ల వయసు (ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది) ఉండాలి.


అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో పాటు కనీసం ఏడాది బ్యాంకింగ్ అనుభవంతో పాటు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వేతనం: నెలకు రూ. 48,480 నుంచి రూ. 5,920 అందిస్తారు.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు స్థానిక భాష టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో నెగిటివ్ మార్కులుంటాయి.

ఫీజు: రూ. 1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 59 దరఖాస్తు రుసుము చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: ఆగస్టు 16, 2026.

వెబ్ సైట్: https://pnb.bank.in