Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

ఎస్బీ ఐలో 9124 జూనియర్ అసోసియేట్ పోస్టులు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్కు కేడర్ జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,124 పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో తెలంగాణలో 260 రెగ్యులర్ పోస్టులున్నాయి. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్/సెమిస్టర్ విద్యార్థులు కూడా టెంపరరీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తులు ఆగస్టు 11 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు: జూనియర్ అసోసియేట్
మొత్తం పోస్టులు : 9124
రెగ్యులర్ పోస్టులు 7680
బ్యాక్ లాగ్ ఖాళీలు: 1444
తెలంగాణలో ఖాళీలు: 260

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
డిసెంబర్ 31, 2026 నాటికి డిగ్రీ పూర్తి చేయాలి. ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ విద్యార్థులు టెంపరరీ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు డిసెంబర్ 31 లోపు డిగ్రీ ఉత్తీర్ణతకు చెందిన ఆధారాలు సమర్పించాలి.

వయసు: 2‌-4-1998 నుంచి 1-4-2006 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు సడలింపులు వర్తిస్తాయి.

వేతనం: రూ. 24,050 నుంచి రూ. 64,480 పేస్కేల్ ఉంటుంది. మెట్రో నగరాల్లో డీఏ, ఇతర అవెన్సులు అదనంగా ఉంటాయి.

ఎంపిక: మూడు దశల్లో ఎంపిక చేస్తారు. ప్రిలమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.

పరీక్షా విధానం:


ప్రిలిమ్స్ 100 మార్కులు, 60 నిమిషాల వ్యవధి ఉంటుంది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ – 30 ప్రశ్నలు
న్యూమరికల్ ఎబిలిటీ – 35 ప్రశ్నలు
రీజనింగ్ ఎబిలిటీ- 35 ప్రశ్నలు

మెయిన్స్ పరీక్ష : 200 మార్కులకు ఉంటుంది. సమయం 2 గం. 40 నిమిషాలు
జనరల్ /ఫైనాన్స్ అవేర్ నెస్ – 50 ప్రశ్నలు
జనరల్ ఇంగ్లిష్ – 40 ప్రశ్నలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 50 ప్రశ్నలు
రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ – 50 ప్రశ్నలు
గమనిక నెగిటివ్ మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 1/4 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

లోకల్ లాంగ్వేజ్ టెస్ట్: సంబంధించిన రాష్ట్ర స్థానిక భాషలో ఈ టెస్ట్ ఉంటుంది. టెన్త్/12వ తరగతిలో స్థానిక భాష చదివినట్లు సర్టిఫికెట్ ఉంటే ఈ టెస్ట్ మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఫీజు: జనరల్ /ఓబీసీ/ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభం: 11-08‌-2026

చివరితేదీ: ఆగస్టు 31, 2026

ప్రిలిమినరీ టెస్ట్: సెప్టెంబర్ 2026

మెయిన్స్: నవరంబర్ 2026

పరీక్షా కేంద్రాలు: ఏపీలో అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం.

వెబ్ సైట్: https://sbi.bank.in/web/careers