యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 395 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డీజీఎం పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు.
అర్హతలు: పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, బీకామ్, బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంటెక్, ఎమ్మెస్సీతో పాటు బ్యాంకింగ్‌లో పని అనుభవం ఉండాలి. పోస్టులను బట్టి 22 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఈ పోస్టులకు అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: ఎంపికైనవారికి పోస్టును బట్టి నెలకు రూ. 64,820 నుంచి రూ. 1,56,500 వరకు జీతం ఉంటుంది.
చివరితేదీ: దరఖాస్తులను ఆగస్టు 10వ తేదీలోగా చేసుకోవాలి.
వివరాలకు వెబ్‌సైట్: https://www.unionbankofindia.bank.in















