ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉపాధి అవకాశాలు, ఉన్నత చదువులకు అనుగుణంగా డిజైన్ చేసిన పలు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ , బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc – MPC – MPCs విభాగాల్లో), అలాగే ఒక సంవత్సరం వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
చివరి తేదీ: సెప్టెంబరు 15వ తేదీలోగా విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ www.drbraouap.ac.in ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.
గమనిక: ప్రభుత్వం నిర్దేశించిన యూజీసీ-డిఇబి (UGC-DEB) నిబంధనల ప్రకారం అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC-ID) తో పాటు DEB-ID ని తప్పనిసరిగా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత: ఇంటర్మీడియట్, 10+2 (NIOS / APOS), పాలిటెక్నిక్ డిప్లొమా, లేదా రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బిఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి.
ఫీజుల వివరాలు: ట్యూషన్ ఫీజు రూ. 3,300 గా నిర్ణయించారు. సైన్స్, కంప్యూటర్ కోర్సులు ఎంచుకున్న అభ్యర్థులు ప్రాక్టికల్స్ నిమిత్తం అదనంగా ప్రయోగశాల (లాబ్) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 73 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్, కోర్సు మెటీరియల్ సేవలను వర్సిటీ అందజేస్తోంది.
వెబ్ సైట్: www.drbraouap.ac.in















