Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

రైల్ కోచ్ ఫ్యాక్టరీలో734 అప్రెంటిస్ ఖాళీలు..ఎగ్జామ్ లేకుండా ఎంపిక

భారతీయ రైల్వేకు చెందిన రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (RCF) కపుర్తలాలో 734 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలచేసింది. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవు. అర్హులైన వారు సెప్టెంబరు 5, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులు ఫిట్టర్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత కూడా కలిగి ఉండాలి.

వయసు: అభ్యర్ధుల వయోపరిమితి 2026 సెప్టెంబరు 5 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులు (PWBD) 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

నియామకం: ఈ అప్రెంటిస్‌ నియామకంలో అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవు. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

చివరితేదీ: సెప్టెంబరు 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్ సైట్: https://rcf.indianrailways.gov.in