Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. NEET UG-–2026లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. https://tsmedadm.tsche.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల మ్యాట్రిక్స్‌ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది. Health Education & Medical అర్హులైన విద్యార్థులు.. అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. పూర్తి వివరాలు, సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.