Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

కేంద్ర ప్రభుత్వ స్కూళ్లలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన పాఠశాలల్లోని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 828 పోస్టుల్లో ప్రిన్సిపాల్ -124, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు – 704 ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ బీఈడీ అర్హతతో పాటు టీచింగ్ అనుబవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు చివరితేదీ ఆగస్టు 14, 2026. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
వయసు: జనరల్ /ఈడబ్ల్యూఎస్ వారికి ప్రిన్సిపాల్ పోస్టుకు 50 ఏళ్లు, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు 35 ఏళ్లు వయసు నిర్ణయించారు. నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 25. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: నవంబర్ 1న నిర్వహించే కంబైన్డ్ రిక్రూట్ మెంట్ 300 మార్కుల టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలకు వెబ్ సైట్: https://www.upsc.gov.in/