Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

ఇస్రోలో 92 సైంటిస్ట్‌ ఖాళీలు

సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ 92 పోస్టుల భర్తీకి ఇస్రో సెంట్రలైడ్జ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గేట్‌ స్కోర్‌తో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ (ఎలక్ట్రానిక్స్‌) 34
సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ (మెకానికల్‌) 26
సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ (కంప్యూటర్‌ సైన్స్‌) 13
సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ (సివిల్‌) 10
సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ (ఎలక్ట్రికల్‌) 4
సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ (రిఫ్రిజిరేషన్‌ అండ్‌ కండిషనింగ్‌) 2
సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ (ఆర్కిటెక్చర్‌‌) 2
సైంటిస్ట్‌/ఇంజినీరింగ్‌ ‘ఎస్సీ’ (సివిల్‌-పీఆర్‌ఎల్‌) 1

అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించరాదు.

ఎంపిక:
గేట్‌ స్కోర్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ. 56,100 తోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
ఫీజు:
రూ. 250, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 17, 2026
వెబ్‌సైట్‌ www.isro.gov.in