Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

పోలీస్ కొలువుల జాతర

తెలంగాణలో మరోసారి పోలీస్ కొలువుల జాతర మొదలైంది. తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్ పీఆర్ బీ) జులై 29న నోటిఫికేషన్ లు జారీ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్ (ఎస్ పీఎఫ్), అగ్రిమాపక, జైళ్ల శాఖలకు చెందిన వేర్వేరు నాలుగు ప్రకటనలు వెలువడ్డాయి. మొత్తం పోస్టుల్లో కానిస్టేబుల్ స్థాయి పోస్టులే అధికంగా ఉన్నాయి. మొత్తం 7,437 పోస్టుల భర్తీ చేయనుండగా అందులో 7 వేలకు పైగా కానిస్టేబుల్ స్థాయి పోస్టులున్నాయి.
శాఖల వారీగా పోస్టుల వివరాలు:

పోలీస్ శాఖ ఖాళీలు:
సివిల్ ఎస్సీ – 148
ఏఆర్ ఎస్సై – 14
టీజీఎస్పీ ఏఆర్ ఎస్సై – 12
ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సీ – 3
ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై – 23
సివిల్ కానిస్టేబుల్ – 3,697
ఏఆర్ కానిస్టేబుల్ – 1,052
ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ -24
కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీవో – 20
కానిస్టేబుల్ (మెకానిక్) పీటీవో – 7

ఫైర్ డిపార్ట్ మెంట్:
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39
ఫైర్ ఫైటర్ – 751


జైళ్ల శాఖ:
డిప్యూటీ జైలర్ (పురుషులు)- 14
డిప్యూటీ జైలర్ (మహిళలు) – 1
వార్డర్ (పురుషులు)- 196
వార్డర్ (మహిళలు) – 12


స్పెషల్ పార్టీ పోలీస్:
ఎస్సై – 44
కానిస్టేబుల్ – 1380

కావలసిన ధ్రువీకరణ పత్రాలు:
తెలంగాణలో స్థానికతను సూచించే ధ్రువ పత్రాలు
ఎస్సీ అభ్యర్థులు అయితే ఎస్సీ, గ్రూప్ -1, 2,3 ఉపవర్గీకరణతో ఉన్న తాజా సామాజిక ధ్రువ పత్రం
ఎస్సీ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వం నుంచి పొందిన ధ్రువీకరణ పత్రం ఉంచుకోవాలి.
బీసీ అభ్యర్థులు ఈ ఏడాది ఏఫ్రిల్ 1 తర్వాత తీసుకున్న నాన్ – క్రీమీలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి.
1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణపత్రం (ఏది వర్తిస్తే అది తీసుకోవాలి)
దివ్యాంగులు, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద అర్హులైతే సంబందిత సర్టిఫికెట్లు ఉండాలి.
గమనిక: అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
వెబ్ సైట్: www.tgprb.in