మొత్తం 1,000 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తొలిసారిగా ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలకు సంబంధించిన కొత్త ఎంపిక విధానాన్ని రూపొందించగా, ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే అధికారిక నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
మూడు విశ్వవిద్యాలయాల్లో 1,000 ఫ్యాకల్టీ పోస్టులు
ప్రభుత్వం ఆమోదించిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యవసాయ విశ్వవిద్యాలయం
- ప్రొఫెసర్ పోస్టులు – 48
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు – 148
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 370
- మొత్తం పోస్టులు – 566
ఉద్యాన విశ్వవిద్యాలయం
- ప్రొఫెసర్ పోస్టులు – 17
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు – 44
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 79
- మొత్తం పోస్టులు – 140
పశువైద్య విశ్వవిద్యాలయం
- వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 235
- డెయిరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 20
- మత్స్యశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 39
- మొత్తం పోస్టులు – 294
మూడు విశ్వవిద్యాలయాల్లో కలిపి మొత్తం 1,000 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంటర్వ్యూలకు బదులుగా కొత్త ఎంపిక విధానం
ఈ నియామకాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించకుండా పూర్తిగా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాల రూపకల్పన బాధ్యతను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ నిపుణులతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంపిక విధానం
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేపట్టే అవకాశం ఉంది.
విద్యార్హతలకు – 50 మార్కులు
- బ్యాచిలర్ డిగ్రీ – 10 మార్కులు
- మాస్టర్స్ డిగ్రీ – 15 మార్కులు
- పీహెచ్‌డీ – 5 మార్కులు
- అంతర్జాతీయ ఫెలోషిప్ – 5 మార్కులు
- గోల్డ్ మెడల్స్ – 3 మార్కులు
- పరిశోధనా జర్నల్స్‌లో ప్రచురణలు – 4 మార్కులు
- పేటెంట్లు, ఆవిష్కరణలు – 4 మార్కులు
- పరిశోధనా సంస్థల్లో అనుభవం – 4 మార్కులు
రాత పరీక్ష – 50 మార్కులు
విద్యార్హతలకు 50 శాతం, రాత పరీక్షకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రతిపాదించారు.
చదవండి: Good News: తెలంగాణలో 7,400కు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్!
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపిక విధానం
ICAR మరియు UGC మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేపట్టనున్నారు.
- విద్యార్హతలు, అకడమిక్ రికార్డుకు – 80% వెయిటేజీ
- డెమో లెక్చర్ / అకడమిక్ విజన్ ప్రజెంటేషన్ / రీసెర్చ్ ప్రపోజల్‌కు – 20% వెయిటేజీ
వయోపరిమితి ఎలా ఉంటుంది?
ఈ నియామకాలకు సంబంధించిన వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అమలు చేయనున్నారు.
త్వరలో నోటిఫికేషన్
ప్రభుత్వం ఎంపిక విధానానికి తుది ఆమోదం తెలిపిన వెంటనే వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. అధ్యాపక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అధికారిక ప్రకటనలను గమనిస్తూ అవసరమైన అర్హత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.















