Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (UG)‌‌-2026

దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు ఇతర విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో విద్యార్థి గరిష్టంగా 5 సభ్జెక్టులు మాత్రమే ఎంపిక చేసుకునే వీలుంటుంది. మే 11 నుంచి 31 మధ్య ఆన్ లైన్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్ టీఏ తెలిపింది. తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో 37 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 3 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.జనవరి 31 వరకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చు. దేశంలోని 306 సెంటర్లతోపాటు విదేశాల్లోని 15 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ వివరాలు:
అర్హత: ఇంటర్ లేదా సమాన అర్హత
ఇంటర్ రెండో సంవత్సరం చుదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే..
మీడియం: మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అవి హింది, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు: ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ పరీక్ష కేంద్రాలు:
అదోని, అమలాపురం, అనంతపురం, బీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుత్తూరు, రాజమహేంద్రవరం, రాయచోటి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, పెద్దపల్లి.
దరఖాస్తులు: జనవరి 3, 2026 నుంచి జనవరి 30, 2026 వరకు.
పరీక్షలు: మే 11 నుంచి 31, 2026.